Advertisementt

సుదీర్ బాబు అనుకున్నది సాధించినట్టేనా?

Mon 28th Dec 2015 04:00 PM
bhale manchi roju,sudheer babu  సుదీర్ బాబు అనుకున్నది సాధించినట్టేనా?
సుదీర్ బాబు అనుకున్నది సాధించినట్టేనా?
Advertisement
Ads by CJ

నటుడిగా ఎప్పటికప్పుడు తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ వైవిధ్యమైన పాత్రలను, స్క్రిప్టులను ఎంచుకుంటున్నా నటుడు సుదీర్ బాబుకు ఒకేఒక్క ప్రేమ కథా చిత్రం తప్ప చెప్పుకోదగ్గ గొప్ప సినిమా పడలేదనే చెప్పుకోవాలి. బావమరిది మహేష్ బాబు అండదండలు, పిల్లనిచ్చిన మామ సూపర్ స్టార్ కృష్ణ దీవెనలు ఉన్నప్పటికీ సుదీర్ బాబు కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. ఖర్చుకు వెనకాడకుండా, తనకు బాగా ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కలిసి భలే మంచి రోజును నిర్మిస్తామంటే, సుదీర్ బాబుకు ఇదే నిజమైన అవకాశంలా అనిపించిందేమో. పైగా ట్రెండీగా ఉన్న దర్శకుడు, కాన్సెప్టు కూడా కుదిరాయి. అందుకే నిర్మాతల బరువును కూడా కాస్తంత తన భుజాల మీద వేసుకొని మోసుకుంటూ చేసిన సినిమా భలే మంచి రోజు. నిజానికి ప్రేమ కథా చిత్రం చేస్తున్నప్పుడు మనసులో కొన్ని డౌట్స్ ఉండేవి కానీ భలే మంచి రోజు మీద మాత్రం భలే కాన్ఫిడెన్స్ ఉండింది. అందుకే ఈరోజు ప్రేక్షకులు ఇంతటి విజయాన్ని అందించారు అని సుదీర్ బాబు తాను అనుకున్నది సాధించిన ఉత్సాహంలో రేపటి నుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని ప్రముఖ పట్టణాలు కవర్ చేసేలా విజయయాత్ర కూడా ప్లాన్ చేసాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ