Advertisementt

ఆది లేదా అదుర్స్ 2 అంట!

Mon 28th Dec 2015 02:29 PM
aadi,adurs 2,jr ntr,vv vinayak  ఆది లేదా అదుర్స్ 2 అంట!
ఆది లేదా అదుర్స్ 2 అంట!
Advertisement
Ads by CJ

వీవీ వినాయక్, ఎన్టీయార్ ఓ సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిస్తే ఓ ఆది, ఓ అదుర్స్, ఓ సాంబ లాంటి పటిష్టమైన సినిమాలే తప్ప నిరాశపరిచినవి లేవు. అందుకే గత కొద్దిరోజులుగా నందమూరి అభిమానుల నుండి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎన్టీయార్, వినాయక్ గారితో ఓ ప్రాజెక్ట్ చేస్తారా అన్న ఆశ ఎక్కువైంది. అందుకు అనుగుణంగానే ఈరోజు నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో వినాయాక్ స్టేజి మీదకు రాగానే నందమూరి అభిమానుల గోల ఎక్కువైంది. తొందరలోనే నేను ఎన్టీయారుతో ఓ సినిమా చేస్తాను. అది ఆది అవుతుందా లేక అదుర్స్ 2 అవుతుందా అన్నది మీకు త్వరలోనే చెబుతాం అంటూ అభిమానులకు వినాయక్ భరోసా ఇచ్చారు. అలాగే నాన్నను ప్రేమించే ఓ అత్యున్నతమైన మనుషులైన ఎన్టీయార్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి వారి నుండి వస్తున్న ఈ నాన్నకు ప్రేమతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని కూడా ఆశీర్వాదాలు అందజేశారు వినాయాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ