Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్రమే ప్రవేశం!

Mon 28th Dec 2015 10:26 AM
jr ntr,nannaku prematho,nandamuri fans,nannaku prematho audio launch,young tiger,only ntr fans  ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్రమే ప్రవేశం!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్రమే ప్రవేశం!
Advertisement
Ads by CJ

ఇప్పుడు నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారా? అంటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గత కొంతకాలంగా బాబాయ్ బాలకృష్ణతో దూరంగా వుంటున్నారు ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ సినిమాల పరంగా ప్రత్యక్షంగా ఎప్పుడూ పోటీపడలేదు. అయితే ఈ సంక్రాంతికి ఆ సమరం జరగబోతుంది. బాబాయ్, అబ్బాయ్‌లు పోటీపడి తమ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అయితే నేడు(డిసెంబర్ 27) శిల్పాకళా వేదికలో జరగనున్న ఆడియో వేడుకలో నందమూరి అభిమానుల్లో.. కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే ఈ ఆడియో వేడుకలో పాల్గొనబోతున్నారు. అంతేకాదు ఈ ఆడియో ఫంక్షన్‌కు సంబంధించిన పాస్‌లు కూడా ఎన్టీఆరే తన అధీనంలో వుంచుకుని.. కేవలం తన ఫ్యాన్స్‌కు మాత్రమే పాస్‌లు పంపిణీ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆడియో వేడుకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ