Advertisementt

సుకుమార్ సినిమా ‘డైరెక్టర్’ కాదు!

Sun 27th Dec 2015 01:56 PM
sukumar,director,darsakudu movie,daarsanikudu movie,kumari 21f,nannaku prematho  సుకుమార్ సినిమా ‘డైరెక్టర్’ కాదు!
సుకుమార్ సినిమా ‘డైరెక్టర్’ కాదు!
Advertisement
Ads by CJ

వైవిధ్య చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల సుకుమార్ నిర్మాతగా.. రచయితగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సంచలనం తెలిసిందే. అయితే ఇప్పుడు అందరూ సుకుమార్ మళ్ళీ నిర్మాతగా ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడనే ఆసక్తి అందరిలోనూ వుంది. అయితే సుకుమార్  ‘డైరెక్టర్’ అనే పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నాడనే వార్త ప్రచారంలో వుంది. తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రానికి ‘దర్శకుడు’ అనే టైటిల్‌ను.. దార్శనీకుడు అనే ఉపశీర్షికను నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ దర్శకుడు చిత్రం ద్వారా సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు సుకుమార్ అధికారికంగా తెలియజేస్తాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ