‘సుధీర్‌కు సరైన హిట్ పడితే సూపర్‌స్టార్ అయ్యే స్టామినా వుంది’ అంటూ ‘భలే మంచి రోజు’ ఆడియో వేడుకలో బావ సుధీర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి బావ కళ్లలో ఆనందం చూశాడు ప్రిన్స్ మహేష్‌బాబు. ఇక అప్పుడే సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్‌తో పాటు మరో సూపర్‌స్టార్ సుధీర్ రాబోతున్నాడని కృష్ణ అభిమానులు పండగ చేసుకున్నారట.. ఇక ఆ ‘భలే మంచి రోజు’ రానే వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సుధీర్ పర్‌ఫార్మెన్స్ గురించి కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కిటిక్స్‌పరంగా మెప్పించినా.. కామన్ ఆడియన్‌లో కాస్త అసంతృప్తి వున్నా కలెక్షన్లు బాగానే వున్నాయట. అయితే ఈ వసూళ్లు వీకెండ్ వరకే పరిమితమైతే సుధీర్ ఎప్పటిలాగే ఉత్తుత్తి స్టార్ అని.. సోమవారం నుంచి కూడా ఇదే కలెక్షన్లు వుంటే మా సూపర్‌స్టార్ మాట ప్రకారం మా సుధీర్‌బాబు కూడా సూపర్‌స్టారే అంటున్నారు ఆయన అభిమానులు.. అయితే తన బావ సినిమాని మహేష్‌బాబు ఇంకా చూడకపోవడం కొసమెరుపు.