Advertisementt

పది కోట్లు దెబ్బేసినారు!

Sun 27th Dec 2015 01:31 PM
loafer losses,puri jagannath,varun tej,c kalyan  పది కోట్లు దెబ్బేసినారు!
పది కోట్లు దెబ్బేసినారు!
Advertisement
Ads by CJ

నిర్మాత C కళ్యాణ్ గారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేను నిర్మాతగా డబ్బులు సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ అన్న మాటలు అక్షర సత్యమే కాబోలు. ఎందుకంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా కళ్యాణ్ నిర్మించిన లోఫర్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద అడ్డంగా పడుకుంది. సుమారు పంతొమ్మిది కోట్లు పై చీలుకు బడ్జెట్ మీద రూపొందిన ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ స్థాయిలోనే జరిగింది. వరుణ్ తేజ్ కంచె విజయం ముందు పూరీ సాధించిన ఓటములు వ్యాపారం చేయడానికి అడ్డు పడలేదు. రిలీజు తరువాత కూడా పూరీ గారు మదర్ సెంటిమెంట్ అంటూ రకరకాల కాకమ్మ కథలు చెప్పినా రెవెన్యూ మాత్రం దమ్మిడీ లేదు. మొదటి వారాంతం అవగానే లోఫర్ అన్న ఓ సినిమా ఉందన్న విషయమే జనాలు మరిచినట్టున్నారు. కలెక్షన్ ఎకాఎకీ డ్రాప్ అయ్యాయి. వరస పెట్టి క్రిస్మస్ వేడుకను క్యాష్ చేసుకునే పనిలో వచ్చిన మామ మంచు అల్లుడు కంచు, సౌఖ్యం, భలే మంచి రోజు, జత కలిసే పెక్కు సినిమా హాళ్ళు ఆక్రమించడంతో లోఫర్ ఎంత కాదన్నా తొమ్మిది నుండో పది కోట్ల వరకూ లాస్ మీద క్లోజ్ అయ్యే చాన్సు ఉందని వ్యాపార వర్గాల భోగట్టా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ