భలే మంచి రోజు అంటూ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు కొట్టేసిన దర్శకుడు శ్రీరాం ఆదిత్యకు సినిమాల్లో పేరు సాధించాలన్న తపన చిన్నతనంలోనే పుట్టింది. ఆ కోరిక తనతో పాటే పెరిగి ఇలా దర్శకుడిగా మారడానికి మాత్రం ఆయనలో అనుక్షణం ఎనలేని ప్రోత్సాహాన్ని నింపిన పేరు చిరంజీవి. అందరం సినిమాలు చూస్తాం, కానీ కొంతమంది మాత్రమే చూస్తూ చూస్తూ సినిమా లెసన్స్ నేర్చుకుని జీవితంలో స్థిరమైన పొజిషన్లో ఉన్నా అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో ఒకరు శ్రీరాం ఆదిత్య. ఇంజీరింగ్ పూర్తి చేసి గూగుల్, ఫేస్ బుక్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగాలు చేసి స్క్రిప్ట్ రెడీ, నిర్మాత రెడీ అవగానీ అన్నింటికీ గుడ్ బై చెప్పిన బాయ్. చిరంజీవి గారంటే అందరికీ ఇష్టమే. కానీ నాకు మాత్రం నిజమైన ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనంటే ఎనలేని అభిమానం. చిరంజీవి గారికి నేనొక పెద్ద ఫ్యానుని అంటూ చెబుతుంటే శ్రీరాం కళ్ళల్లో నిజమైన ఆనందం, భక్తి భావం కనిపించింది. కనీసం అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పని చేయకుండా సరాసరి డైరెక్షన్ కుర్చీ వేసేసుకున్న కొద్ది మంది సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఇప్పుడు శ్రీరాం కూడా ఒకరయ్యారు.