డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి తనయుడు ఆదికి ఇంకా సరైన హిట్టు పడలేదు. సేఫ్ రొమాంటిక్ ఫార్ములాతోనే కంఫర్టేబుల్ జర్నీ చేస్తున్న ఆదికి ఇప్పుడు ఇది సరైన రూటు అనిపించటం లేదు. స్టార్ హీరోగా ఎదగాలంటే ఇంకేదో చేయాలనే తపనతో ఒప్పుకున్న చిత్రమే గరం. సాయి కుమార్ గారి భార్య సురేఖ నిర్మాణంలో ఆది నటించిన ఈ గరం మూవీ పక్కా మాస్ మసాలా ఫ్లేవరుతో నిండింది. ఉత్తమ అభిరుచి గల దర్శకుడిగా పేరు పొందిన మదన్ కేవలం గరం కోసమే మాస్ తోక తొక్కాడు. ఈ విషయం మనకు ట్రైలర్లోనే స్పష్టంగా తెలిసింది. రగ్గుడ్ లుక్కుతో ఆదిలో కొత్త ఎనర్జీ పెల్లుబుకుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆదికి జంటగా అదా శర్మను కూడా చొప్పించారు. కథలో కొత్తదనం వెతకాల్సిన పని లేకుండా కేవలం హీరో మాస్ క్యారెక్టరైజేషన్ పైనే ఓ యూత్ ఫుల్ రొమాన్సుకు, యాక్షన్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసినట్టు తెలుస్తోంది. హీరో నుండి స్టార్ హీరో రేంజుకు ఎదగాలంటే తెర మీద హీరో ఒక్కడిదే విశ్వరూపం కన్పించాలి తప్ప తెరవెనుక వారు కనుమరుగైపోవాలి. గరంలో ఆ సరంజామా ఫుల్లుగా నింపినట్టే ఉన్నారు.