రామ్‌చరణ్ నిర్మాతగా మారి, వినాయక్ దర్శకత్వంలో తమిళ 'కత్తి' రీమేక్‌ను తెలుగులో చిరు 150వ చిత్రంగా రూపొందించేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ సంక్రాంతి సందర్బంగా చేస్తారని సమాచారం. అందుకోసం రామ్‌చరణ్ ఎప్పుడో ప్రారంభించాల్సిన 'తని ఒరువన్' రీమేక్‌ను సంక్రాంతి దాటిన తర్వాత అంటే జనవరి 16న ప్రారంభించనున్నాడు. కాగా చిరు 150వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించాలని రామ్‌చరణ్ భావిస్తున్నాడట. కానీ చిరు మాత్రం ఈ చిత్రం బడ్జెట్ విషయంలో చరణ్‌కు ఓ సలహా ఇచ్చాడట. తన 150వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆలోచించవద్దని, వీలైనంత తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించమని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో లైకా ప్రొడక్షన్స్ కూడా సంయుక్త భాగస్వామిగా ఉండే అవకాశం ఉండటంతో చిరు చరణ్‌ను ఎక్కువ డబ్బులు పెట్టి వృథా చేయవద్దని, ఇది ఆల్‌రెడీ ఓ భాషలో తీసిన చిత్రం కాబట్టి ముందుగానే బడ్జెట్‌ను ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉందని, తమిళంలో ఈ చిత్రానికి 50 నుండి 60కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టారని, దానికి ఓ పదికోట్లు అటు ఇటుగా సినిమా నిర్మాణ వ్యయం ఉండేలా జాగ్రత్త పడమని చిరు తన అనుభవం నేర్పిన పాఠంతో తన కుమారుడికి సలహా ఇచ్చాడని సమాచారం.