Advertisementt

రామ్‌చరణ్‌ చాలా గొప్పోడట!

Fri 25th Dec 2015 06:20 PM
ram charan,johnny master,ram charan helping nature,ram charan helps johnny master,apollo hospitals  రామ్‌చరణ్‌ చాలా గొప్పోడట!
రామ్‌చరణ్‌ చాలా గొప్పోడట!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ నటించిన 'రచ్చ, నాయక్‌, ఎవడు, బ్రూస్‌లీ' చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేసిన జానీ మాస్టర్‌ చరణ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రామ్‌చరణ్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఎంతో మంచివాడని, తనకు కష్ట సమయంలో చేసిన సాయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాని మాస్టర్‌ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ....నా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ప్రాబ్లం అయింది. హాస్పిటల్‌ ఖర్చు కూడా భారీగా అయింది. ఆ సమయంలో రామ్‌చరణ్‌ నాకు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నాడు. చరణ్‌ ఒక్క మాట చెప్పగానే అపోలో ఆసుపత్రిలో నా భార్య, కొడుకు విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు. చరణ్‌ తన అనుకున్న వారికోసం ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్దంగా ఉంటారు. తనతో కలిసి పనిచేసే వారితో చరణ్‌ మంచి రిలేషన్‌షిప్‌ మెయిన్‌టైన్‌ చేస్తాడు. అందరినీ కలుపుకుపోతారు. ఆయనకు ఒక్కసారి కనెక్ట్‌ అయితే చాలా చాలా సపోర్ట్‌గా ఉంటారు.. అని జానీ చెప్పుకొచ్చాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ