పండగను కూడా బూతాడాల్సిందే!

Fri 25th Dec 2015 01:11 PM
poonam pandey,jingle bells,jingle boobs  పండగను కూడా బూతాడాల్సిందే!
పండగను కూడా బూతాడాల్సిందే!

సెక్స్ అండ్ వయోలెన్స్ ఆల్ వేస్ సెల్స్ అని ఎవరో అన్నారు. అది సినిమా అయినా, బయట ఇంకేదైనా సెక్స్ మాత్రం విపరీతంగా అమ్ముడవుతుందని ఇదిగో అప్పుడప్పుడు పూనమ్ పాండే లాంటి వాళ్ళు తెలియజేస్తుంటారు. క్రిస్మస్ పండక్కి మీకందరికీ ఓ హాట్ హాట్ బహుమతి ఇస్తానని చెప్పిన పూనం ఎట్టకేలకు యూట్యూబు ద్వారా జింగిల్ బెల్స్ పాటను మార్చేసి జింగిల్ బూబ్స్ పేరిట ఓ బూతు ప్రక్రియను మన ముందు వాటంగా ఉంచింది. ఈవిడ గారి పైత్యం గూర్చి ప్రేక్షకులకి తెలియనిది కాదు, మన టీం  వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని బోల్డుగా స్టేట్మెంట్ ఇచ్చి ఆనక తప్పుకున్న వనితా శిరోమణి. ఆ దెబ్బతో ట్విట్టర్లో ఈమెకున్న ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కె స్థాయికి ఎదిగింది. అక్కడి నుండి ఎప్పుడు పడితే అప్పుడు, సందర్భం దొరికిన ప్రతిసారీ అశ్లీల వీడియోలను పోస్ట్ చేస్తూ రోజురోజుకీ పెరిగిపోతున్న క్రేజ్ సంపాదించుకుంటోంది. పసి పిల్లలు ఆడిపాడుకునే జింగిల్ బెల్స్ పాటని ఖూనీ చేసి ఇది బూతు ప్యారడీ అంటూ జింగిల్ బూబ్స్ చూపిస్తోంది. అంతే కాదు మెర్రీ క్రిస్మస్ అర్థాన్నే మార్చేలా మెర్రీ... కిస్... మస్ అంటూ నిట్టూర్పులు వదిలి యూత్ మొత్తాన్ని బుట్టలో వేసుకుంటోంది.