Advertisementt

అనుష్క ప్రామిస్ చేసిందట

Thu 24th Dec 2015 01:30 PM
anushka,rudraksha,krishna vamsi,dil raju  అనుష్క ప్రామిస్ చేసిందట
అనుష్క ప్రామిస్ చేసిందట
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే చాలు అనుష్క తప్ప ఇంకెవరు గుర్తుకు రానంతగా తయారయింది. అరుందతి, వర్ణ, సైజు జీరో, రుద్రమదేవి, బాహుబలిలతో పాటుగా ఇప్పుడు కృష్ణ వంశీ త్వరలో తీస్తానన్న ఓ భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ రుద్రాక్ష కథకు కూడా అనుష్కనే ఓకే చేయనున్నారట. గ్లామర్ పాత్రల నుండి ఇలా కొత్త బాటలోకి వెళ్ళిన అనుష్కకు నిజంగానే తిరుగేలేకుండా పోయింది. కృష్ణ వంశీ గారు కథ, కథనాలు తయారు చేసే పనిలో ఉంటె నిర్మాతగా దిల్ రాజు ఉండడానికి సిద్ధమయ్యాడు. మురారి, శ్రీ ఆంజనేయం తదితర పక్కా కృష్ణ వంశీ మార్క్ ఉన్న చిత్రాలు చూస్తే అతగాడికి ఈ జోనర్లో ఎంతటి పరిపూర్ణమైన నైపుణ్యం ఉందొ అవగతమవుతుంది. అందుకే దిల్ రాజు కూడా మారు మాట్లాడకుండా ఈ స్క్రిప్టును ఫైనల్ చేసేయనున్నాడు. గోవిందుడు అందరివాడేలేతో సహా మరికొన్ని కృష్ణ వంశీ మూవీస్ ఫ్లాప్ అయినా ఆయన పట్ల నిర్మాతలకున్న నమ్మకం సడలలేదు. ఒక్క సరైన హిట్టు పడిందంటే కుదురుకోవడం ఖాయం. అది రుద్రాక్షతోనే కావాలని కోరుకుందాం. బాహుబలి 2తో యమా బిజీగా ఉన్న అనుష్క వచ్చే ఏడాది మధ్యలోకెల్లా కాల్షీట్స్ సర్డుతానని దిల్ రాజుకు, కృష్ణ వంశీకి ప్రామిస్ చేసిందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ