ఒక్కో సెలబ్రిటీ ఫ్యామిలీ నుండి ముగ్గురేసి నలుగురేసి హీరోలు ఉతికి పారేస్తుంటే పాపం ఘట్టమనేని కుటుంబం నుండి ఒకే ఒక్కడు అన్నట్లుగా మహేష్ బాబు బాబు నెట్టుకొస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి తరువాత ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేస్తూ అందరి చేత టాలివుడ్ నెంబర్ వన్ అనిపించుకుంటున్న మహేష్ బాబుకు సొంత ఫ్యామిలీ నుండే ఇంకో హీరో నిజంగా తోడయితే ఇండస్ట్రీని మరింతగా డామినేట్ చేయోచ్చు కదా? అందుకే ఉన్నదాంట్లో గొప్పగా ఉండే బావ సుదీర్ బాబుకు పూర్తి మద్దతునిస్తూ మహేష్ బాబు ఓ ఎఫర్ట్ ప్రకారం భలే మంచి రోజును వెనకేసుకు వస్తున్నాడు. నిజానికి సినిమా కూడా బాగొచ్చిందన్న ప్రీ రిలీజ్ టాక్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతున్న వేళ రేపు విడుదల తరువాత ఇదే మంచి మాట అందరి నోటి వెంట వస్తే సుదీర్ బాబుకు స్టార్ డంతో పాటు మహేష్ బాబుకు ఓ తోడు కూడా దొరికినట్టు అవుతుంది. అటు పై బావా-బామ్మరుదులు ఘట్టమనేని వంశ ప్రతిష్టను మరింత మెరుగుపరుచొచ్చు!