ముంబై బ్యాక్ డ్రాపులో చాలా తెలుగు సినిమాలు వచ్చినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన బిజినెస్ మ్యాన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అక్కడికి మన హీరో వెళ్ళిందే ఓ శౌచాలయం పని మీద కాబట్టి. ఈ సినిమా సూపర్ హిట్టయింది, సో మళ్ళీ మరోసారి ముంబై బ్యాక్ డ్రాపులో మురుగదాస్ కథ తెచ్చాను అనేసరికి మహేష్ బాబు ఎలాగైనా చేసేద్దామని సగం ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇలా ముంబయి నగరంతో మహేష్ బాబుకి వున్న అనుబంధం ఇంకో సినిమాకు దారి తీసింది. ఇంతకుమునుపు కూడా ముంబై స్లీపర్ సేల్స్ నేపథ్యంలో మురుగదాస్ తీసిన తుపాకీ (హిందీలో హాలీడే) విజయవంతం అయింది. అంటే హీరోకు మాత్రమే కాదు దర్శకుడికి కూడా ఈ మహానగరం నచ్చేసింది. ఇండియన్ జ్యుడీషియరీలోని కొన్ని లోటుపాట్ల మీద కథను, కథనాన్ని మునుపెన్నడూ చూడని విధంగా మురుగ తయారు చేసాడని తెలుస్తోంది. జ్యుడీషియరీ అంటున్నారు కాబట్టి మొదటగా ముంబై నగరాన్ని పిశాబ్ పోయించిన మహేష్ ఈసారి అదే నగరంలోని న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తాడేమో?