Advertisementt

బాలయ్య ఊపుకు వాళ్లయితేనే సరిపోతారు!

Wed 23rd Dec 2015 01:13 PM
dictator,balakrishna,mumaith khan,shraddha das  బాలయ్య ఊపుకు వాళ్లయితేనే సరిపోతారు!
బాలయ్య ఊపుకు వాళ్లయితేనే సరిపోతారు!
Advertisement
Ads by CJ

బాలయ్యకు ఊపొచ్చి డ్యాన్స్ ఫ్లోర్ మీద పడ్డాడంటే... నా సామి రంగా... భూగోళం ఊగిపోవాల్సిందే. డిక్టేటర్ కోసం తమన్ స్వరపరిచిన అటువంటి ఓ పాటలో బాలకృష్ణకు సరిజోడిగా ఎవరయితే బాగుంటుందబ్బా అని ఆలోచించిన దర్శకుడు శ్రీవాసుకు ఒక్కరు కాదు ముమైత్ ఖాన్, శ్రద్దా దాస్ లాంటి ఇద్దరు భారీ భామామణులు అయితేనే బాలయ్య ధాటిని తట్టుకోగలరు అనిపించిందట. అందుకే ఉన్న పళంగా ఈ ఇద్దరినీ పిలిపించి నటసింహంతో ఓహో అనిపించుకున్నాడు. ముందుగా నయనతారను మాత్రమే అనుకున్నా, ఈ ఆఖరి సమయంలో అందుబాటులో ఉన్న పై ఇద్దరినీ పిలిపించేసారు. దీనికి బాలయ్య కూడా ఓటేయడంతో షూటింగ్ రేపటి నుండే ప్రారంభం కానుంది. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ మహేష్ బాబుతో ఆడిపాడిన ముమైత్ మరీసారి బాలకృష్ణతో ఎంత వరకు తన వయసు  షేర్ చేసుకుంటుందో. అలాగే హాట్ భామగా పేరు పొందిన శ్రద్ధ దాస్ కూడా హీరోయిన్ పాత్రలు తగ్గేసరికి ఇలా ఐటెం పాటల వైపు మొగ్గు చూపుతోంది. ఇక ఇద్దరి మధ్యలో బాలకృష్ణ మద్దెల దరువు ఎలా ఉంటుందో సంక్రాంతికి చూద్దాం!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ