Advertisementt

ప్రభాస్ పెళ్లి శుభలేఖ

Wed 23rd Dec 2015 11:37 AM
prabhas pelli,aavu puli madhyalo prabhas pelli,prabhakar  ప్రభాస్ పెళ్లి శుభలేఖ
ప్రభాస్ పెళ్లి శుభలేఖ
Advertisement
Ads by CJ

రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళికి ఇంకా టైం ఉందిలెండి. ఈ ప్రభాస్ మన ప్రభాస్ కాదు. విలన్ ఆర్టిస్టుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాలకేయుడు ప్రభాకర్ గురించి. బాహుబలి, మర్యాద రామన్న సినిమాలతో రాజమౌళి ఆశీస్సులు మెండుగా ఉన్న ప్రభాకర్ ఇప్పుడు హీరో రూట్లో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒక వైపు సుమంత్ అశ్విన్ హీరోగా మలయాళం నుండి తెలుగు రీమేక్ చేస్తున్న ఓ సినిమాలో అలాగే ఇదిగో పైన చూస్తున్న ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి అనే వెరైటీ టైటిల్ ఉన్న చిత్రంలోను హీరోగా చేస్తున్నాడు. ప్రభాకర్ కెరీర్ గమ్మత్తైన మలుపు తీసుకుంటోంది. ఒకానొక సమయంలో వేషం దొరికి, ఇల్లు గడిస్తే చాలనుకున్న ఈ హుస్నాబాద్ బలశాలికి అదృష్టం లక్కలాగా చుట్టుకుంది. అందుకే ఈ హీరో, అదీ ప్రభాస్ పేరుతో కూడా కామెడీ వేషాలు పట్టేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ ప్రభాస్... సారీ సారీ ప్రభాకర్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ