కోన ఇటీవల పని చేసిన చిత్రాలన్నీ వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఇక ఆయనే సర్వం తానై చేసిన 'శంకరాభరణం' ఫ్లాప్ మాత్రం ఆయన్ను బాగా కృంగదీసిందని అంటున్నారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంటాడు. కానీ ఈమధ్య ఆయన పెద్దగా ఎక్కడ కనిపించడం లేదని అంటున్నారు. ఆయన పనిచేసిన గోపీచంద్ 'సౌఖ్యం' ఆడియో వేడుకకు ఆయన హాజరుకాలేదు. ఇక బాలకృష్ణతో ఆయన కలిసి చేస్తున్న 'డిక్టేటర్' ఆడియోకు కూడా ఆయన హాజరుకాలేదు. కేవలం ఆయనతో కలిసి పనిచేసిన గోపీమోహన్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యాడు. దీంతో ఆయనపై ఫిల్మ్‌నగర్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. కనీసం 'డిక్టేటర్' అయినా పెద్ద హిట్ అయితే గానీ ఆయన మనసు కుదుటపడదు.. అని అంటున్నారు.