Advertisementt

అఖిల్ మ‌న‌సులో ఆ ద‌ర్శ‌కుడు?

Tue 22nd Dec 2015 06:24 PM
akhil,deva katta,akhil akkineni second movie,deva katta story to akhil,akhil movie,dynamite  అఖిల్ మ‌న‌సులో ఆ ద‌ర్శ‌కుడు?
అఖిల్ మ‌న‌సులో ఆ ద‌ర్శ‌కుడు?
Advertisement
Ads by CJ

త‌న రెండో సినిమా విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు అఖిల్‌. తొలి సినిమాతో ఎదురైన అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో సినిమాకి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఆల‌స్య‌మైనా ఫ‌ర్వాలేదు కానీ...  ఈసారి మంచి క‌థ‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకొంటున్నాడు. ద‌ర్శ‌కుల్ని కాకుండా కేవ‌లం క‌థ‌ల‌నే న‌మ్మాల‌ని నిర్ణ‌యించుకొన్నాడు. అందులో భాగంగా ఇటీవ‌ల బోలెడు క‌థ‌ల్ని విన్న‌ట్టు తెలిసింది. వాటిలో  రెండు మూడు క‌థ‌లు న‌చ్చాయ‌ట‌. అందులో దేవాక‌ట్టా క‌థ కూడా వున్న‌ట్టు తెలిసింది. 

నిజానికి అఖిల్ ఎంట్రీ స‌మ‌యంలోనే దేవాక‌ట్టా పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అఖిల్‌కి అప్పుడు కూడా దేవాక‌ట్టా ఓ క‌థ వినిపించాడ‌ట‌. అయితే ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌ల త‌ర్వాత ఆ క‌థ‌ని అప్ప‌ట్లో ప‌క్క‌న‌పెట్టాల్సి వ‌చ్చింద‌ట‌. ఇటీవ‌ల మ‌ళ్లీ  దేవాక‌ట్టా ఆ క‌థ‌ని అఖిల్‌కి వినిపించాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆటోన‌గ‌ర్ సూర్య‌, డైన‌మైట్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఫ్లాప్‌లు అందుకొన్నాడు దేవాక‌ట్టా. అఖిల్ కూడా ఫ్లాప్‌లో ఉన్నాడు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో ఈ క‌ల‌యిక‌లో సినిమా సాధ్య‌మ‌వుతుందా అన్న‌దే ప్ర‌శ్న‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ