ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు కనిపించిన వస్తువు రేపటికి పాతదై పోతుంది. మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీలతో కొత్త కొత్త వస్తువులు వచ్చి పడుతున్నాయ్..! గ్రామ్‌ఫోన్ ప్లేస్‌లో ..సీడీ ప్లేయర్స్, ఏమ్‌పీ త్రీలు, డిజిటల్ వాయిస్ రికార్డులు, యూఎస్‌బీలు. బ్లూరే ప్లేయర్స్..ఐపాడ్‌లు వచ్చాయి. నేడు దర్శకులు కూడా తమ స్క్రిప్ట్ బుక్‌ని ట్యాబ్‌ల్లో భద్రపరుచుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ తరహాలో వుంటారు. ఎన్నీ లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చినా.. వాటిని చాలా తేలికగా సొంతం చేసుకునే ఆర్థిక పరిస్థితుల్లో వున్నా పాత వాటినే సౌఖ్యంగా ఫీలవుతారు.ఆ కోవలోకే వస్తారు నందమూరి బాలకృష్ణ.. ఆయన తలచుకుంటే విదేశీ వస్తువులు కూడా చిటికెలో తెప్పించుకుంటాడు. అయితే పాతవాటిపై మమకారమో.. లేక వాటితోనే కంఫర్ట్‌గా పీలవుతాడో తెలియదు కానీ.. ఇప్పటికీ బాలయ్య క్యాసెట్లు రికార్డ్‌లనే వాడుతున్నాడు.. తనకు ఎవరైనా స్టోరీ చెప్పదలుచుకుంటే క్యాసెట్లో రికార్డు చేయించుకొని మరీ వింటాడు. అంతేకాదు తను ఎక్కడైనా ముఖ్యమైన వేడుకకు వెళుతుంటే వెంట క్యాసెట్ రికార్డర్ వుండాల్సిందేనట.. ఆదివారం జరిగిన డిక్టేటర్ ఆడియోకు కూడా బాలయ్య ఆ క్యాసెట్ రికార్డర్‌ను వెంటబెట్టుకొని వెళ్ళాడు.. అమరావతి బయలుదేరే ముందు బాలయ్య చేతిలో ఈ రికార్డర్ కనిపించింది. సో.. బాలయ్య క్యాసెట్ రికార్డర్‌ను ఇంకా వాడుతున్నాడన్నమాట..!