బాలయ్య సినిమా అంటేనే అభిమానులకు డైలాగ్‌ల పండగ. పవర్‌ఫుల్ డైలాగ్‌లను నందమూరి నటసింహాం మరింత పవర్‌ఫుల్‌గా చెబుతుంటే.. అభిమానుల రొమాలు నిక్కపొడుకోవాల్సిందే.. బాలకృష్ణ తాజా ‘డిక్టేటర్’లో కూడా సంభాషణలు ఫ్యాన్స్ సంబరపడే విధంగా వున్నాయి. డిక్టేటర్‌లో కొన్ని డైలాగ్‌లు ఇవి ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. నాతో పెట్టుకుంటే జీవితానికి హానికరం’, ‘పర్వతం ఎక్కు ఫర్వాలేదు ఎత్తాలని చూడకు పైకిపోతావ్’, ‘నా పేరు ధర్మ.. నా ఒంట్లో వున్న అహం పేరు డిక్టేటర్. నీ చావు చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు’, ‘మీరు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు. నేను ఏం చేసినా పబ్లిసిటీ అవుతుంది’, ‘దాహం వేస్తే సింహం కూడా తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంతమాత్రాన తలదించుకుని తొడగొట్టకు.. తర్వాత కొట్టడానికి తొడ, ఎత్తడానికి తల వుండదు’ అంటూ ఈ డైలాగులను ‘డిక్టేటర్’ ఆడియో వేడుకలో బాలయ్య తనదైన శైలిలో చెప్పి అభిమానులను ఆనందపరిచాడు.