Advertisementt

బన్నీ దారిలో మహేష్‌...!

Mon 21st Dec 2015 10:02 PM
allu arjun,mahesh babu,varudu,srikanth addala,brahmothsawam  బన్నీ దారిలో మహేష్‌...!
బన్నీ దారిలో మహేష్‌...!
Advertisement
Ads by CJ

గుణశేఖర్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన 'వరుడు' చిత్రం కోసం అప్పట్లో కాస్టింగ్‌ కాల్‌ చేశారు. అందులో రియల్‌ ఫ్యామిలీస్‌ను నటించమని కోరుతూ ఈ తతంగం నడిపారు. ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే చేశారు. కానీ అది ఆ చిత్రానికి ఏమాత్రం హెల్ప్‌ కాలేదు. ఈ చిత్రం బాక్సీఫీస్‌ వద్ద డిజాస్టర్‌ ఫలితాన్ని పొందింది. తాజాగా చక్కటి కుటుంబ కథా చిత్రంగా అందరూ భావిస్తున్న మహేష్‌బాబు-శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి కూడా ఇదే చేస్తున్నారు. రియల్‌ ఫ్యామిలీస్‌కు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇస్తున్నారు. కాగా పివిపి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో తీస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఇందులో సమంత, కాజల్‌, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలా ఒకే రూటులో వెళ్తు 'వరుడు' దారిలో వెళ్లుతోన్న 'బ్రహ్మూెత్సవం' చిత్రం రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో చూడాలి....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ