ఏ సినిమా చూసినా కూడా ఈ మధ్య పవన్ నామస్మరణ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన పేరును వాడుకొని సినిమాలకు క్రేజ్ తీసుకొని రావడానికి, మెగాభిమానులను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా రవితేజ హీరోగా సంపత్‌నంది డైరెక్షన్‌లో వచ్చిన 'బెంగాల్‌టైగర్' చిత్రంలో పవన్ నటించిన 'తమ్ముడు' చిత్రంలోని ఓ పాటను పోసాని కృష్ణమురళిపై స్పూఫ్ చేశారు. 'లుకింగ్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్...' పాటను ఆయనపై చిత్రీకరించారు. ఇక వరుణ్‌తేజ్ హీరోగా పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్' చిత్రంలో కూడా ఇదే పాటను స్ఫూప్ చేశారు. అలీని టార్చర్ పెడూతు పవన్ ఆ పాటలో చేసిన ఫీట్లను అలీ చేత కూడా చేయించారు. మొత్తానికి పవన్ నామస్మరణలో మాత్రం మనవాళ్లందరూ ఆరితేరిపోయారు. ఏదో ఒక విధంగా పవన్ నామస్మరణ చేయడం వల్ల వీళ్లకు బోలెడు లాభం ఉండబట్టే ఈవిధంగా చేస్తున్నారు అని చెప్పకతప్పదు.