Advertisementt

రీమేక్‌ల హవా మొదలైంది..!

Mon 21st Dec 2015 09:06 PM
katthi movie,thani oruvan,premam,shankarabharanam  రీమేక్‌ల హవా మొదలైంది..!
రీమేక్‌ల హవా మొదలైంది..!
Advertisement
Ads by CJ

మన టాలీవుడ్‌ రైటర్స్‌లో క్రియేటివిటీ తగ్గిందా? లేక మన స్టార్స్‌ సేఫ్‌గేమ్‌కు అలవాటుపడుతున్నారా? అనే విషయం అంతుబట్టని విషయం. ప్రస్తుతం చిరంజీవి నుండి మోహన్‌బాబు, అల్లరినరేష్‌ వరకు అందరూ రీమేక్స్‌నే పట్టుకొని వేలాడుతున్నారు. ఏ తెలుగు రచయిత కూడా మెగాస్టార్‌ చిరంజీవిని తన కథతో సంతృప్తిపరచలేకపోయాడు. సరైన స్టోరీ అందించిన వారికి కోటిరూపాయల ప్రైజ్‌మనీ ప్రకటించినప్పటికీ ఎవ్వరూ ఆయనకు సరైన కథను అందించలేకపోయారు. దాంతో ఆయన తమిళ 'కత్తి'ని రీమేక్‌ చేయడానికి డిసైడ్‌ అయిపోయాడు. ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకుడు కాగా, మురుగదస్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ఇక ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ కూడా మరో తమిళ మూవీ 'తని ఒరువన్‌'ను రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య మలయాళ మూవీ 'ప్రేమమ్‌' రీమేక్‌ చేస్తుండగా, మోహన్‌బాబు, అల్లరినరేష్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'మామ మంచు.... అల్లుడు కంచు' చిత్రం ఓ మరాఠి చిత్రానికి రీమేక్‌. ఇక మంచు విష్ణు -రాజ్‌తరుణ్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం కూడా ఓ పంజాబీ స్టోరీకి రీమేక్‌. ఇటీవల విడుదలైన 'శంకరాభరణం' కూడా ఓ రీమేకే కావడం గమనార్హం. అలాగే త్వరలో నితిన్‌ ఓ తమిళ రీమేక్‌ను రీమేక్‌ చేస్తున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్‌ తాను నటించే ఉద్దేశ్యంతో రెండు మూడు రీమేక్‌ చిత్రాల రైట్స్‌ను తన దగ్గరే ఉంచుకున్నాడు. సో... ఇప్పుడు అందరూ రీమేక్‌లకే ఓటేస్తుండటం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ