ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా రవితేజ కమర్షియల్ స్టామినా ముప్పై కోట్ల వరకైనా లేక నలభై కోట్ల క్లబ్బులో చేరకుండా ఊగుతోంది. మాస్ మహారాజాకు సరైన సినిమా, పసందైన క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ కొల్లగొట్టడం గ్యారంటీ అనుకుని బెంగాల్ టైగర్ తీసారు. మొదటి రోజు నుండీ ఇరగ పాజిటివ్ టాక్ మీద ఓపెన్ అయిన ఈ సినిమా రెండో వారం తిరిగేసరికి కాస్త నెమ్మదించింది. అంటే రవితేజ మీద రొటీన్ మాస్ మసాలా పాత్రలతో అతికించిన పోస్టర్ మీదే టైటిల్ మార్చి కొత్త పోస్టర్ వేసినట్టు కాకుండా కాసింత డిఫరెంటుగా ట్రై చేయాల్సిన సమయం వచ్చింది. ప్రయత్నం అంటే మరీ కిక్ 2 కాదనుకోండి. అందుకే దిల్ రాజు మొదలు పెడదామనుకున్న ఎవడో ఒక్కడుకు బ్రేకులు పడి సెకండ్ హాఫ్ మీద దర్శకుడు వేణు శ్రీరామ్ రీ-వర్క్ చేయడం మొదలెడితే, నిర్మాత దామోదర ప్రసాద్ గారు రవితేజతో నూతన దర్శకుడు చక్రి చేతుల మీదుగా లాంచ్ చేయాలనుకున్న మరో కొత్త ప్రాజెక్టు కూడా ఇంకొన్ని వారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బెంగాల్ టైగర్ లాంటి హిట్టు కొట్టినా నిర్మాతల భవితవ్యం దృష్ట్యా రవితేజ తదుపరి సినిమా మొదలు కావడానికి కనీసం మరో రెండు నెలలైనా పట్టొచ్చు.