Advertisementt

వరుణ్ తేజ్ లో ఇంతుందా..!

Mon 21st Dec 2015 01:07 PM
varun tej,varun tej romantic touch,loafer movie,disha patani,varun tej romance with disha patani  వరుణ్ తేజ్ లో ఇంతుందా..!
వరుణ్ తేజ్ లో ఇంతుందా..!
Advertisement
Ads by CJ

మాస్‌హీరోగానూ తాను మెప్పించగలనని 'లోఫర్‌'తో నిరూపించుకున్నాడు సుప్రీం హీరో వరుణ్‌తేజ్‌. ఈ సినిమా వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరింది అంటే... అది వరుణ్‌తేజ్‌కే అని చెప్పవచ్చు. డైలాగులు చెప్పడంలో... ఫైట్స్‌ చేయడంలో వరుణ్‌ ఈజ్‌ చూస్తే ఫ్యాన్స్‌కి ముచ్చటేసింది. అన్నింటికంటే ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్లలో ఆయన ఇరగదీశాడు. దిశాపటాని-వరుణ్‌తేజ్‌ల మధ్య ఓ రొమాంటిక్‌ గీతాన్ని పూరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్‌ బాగా ఇమిడిపోయి జీవించేశాడు. ఓ షాట్‌లో దిశాపటాన్ని పెదవులను సున్నితంగా తన పెదవులతో అందుకొన్నాడు. అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌లు మాస్‌హీరోలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ రొమాంటిక్‌ సీన్ల విషయానికి వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ వరుణ్‌తేజ్‌ మాత్రం.. అదేదో బాగా అలవాటు అన్నట్లుగా అల్లుకుపోయాడు. ఈ విషయంలో వరుణ్‌తేజ్‌కి మంచి మార్కులు పడిపోయాయి. మున్ముందు మనోడు ఇంకెన్ని యాంగిల్స్‌ చూపిస్తాడో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ