Advertisementt

ఇయర్ స్టార్టింగ్ లోనే వర్మ కిల్ చేస్తున్నాడు!

Mon 21st Dec 2015 12:33 PM
killing veerappan,ram gopal varma january 1st,2016,killing veerappan movie  ఇయర్ స్టార్టింగ్ లోనే వర్మ కిల్ చేస్తున్నాడు!
ఇయర్ స్టార్టింగ్ లోనే వర్మ కిల్ చేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

రామ్‌గోపాల్‌వర్మ సినిమా 'కిల్లింగ్‌ వీరప్పన్‌' డిసెంబర్‌ 4న విడుదల కావాల్సివుండగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మీ కోర్టు పిటిషన్‌. అయితే చివరి నిమిషాల్లో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మీ వల్ల ఏర్పడిన సమస్యలను సెట్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా అన్ని లీగల్‌ సమస్యలను, సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నూతన సంవత్సరం మొదటిరోజున అంటే జనవరి 1న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ మేరకు వర్మ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశాడు. లీగల్‌ సమస్యలు తొలగిపోయాయి. సెన్సార్‌ కూడా పూర్తయింది. 'కిల్లింగ్‌ వీరప్పన్‌' జనవరి 1న విడుదల చేస్తున్నాం... అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. మొత్తానికి వాస్తవ ఘటనలను, వాస్తవిక గాధలను, వాస్తవిక వ్యక్తులను కథాంశంగా తీసుకొని సినిమాలు తీసి సంచలనం సృష్టించే అలవాటు వర్మకు బాగానే ఉంది. మరి ఈ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రం విడుదలైన తర్వాత ఎంతటి సంచలనాలకు, సమస్యలకు కారణం కానుందో! ఇది ఇలా వుంటే..ఇయర్ స్టార్టింగ్ లోనే ఈ వర్మ కిల్ చేయడం ఏంటో అని మరికొందరు అనుకోవడం విశేషం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ