Advertisementt

మహేష్‌తో ఏమీ తీస్తున్నారు నాయనా?

Sun 20th Dec 2015 02:28 PM
mahesh babu,brahmotsavam movie,srikanth addala,srimanthudu,prince mahesh babu,seethamma vakitlo sirimalle chettu  మహేష్‌తో ఏమీ తీస్తున్నారు నాయనా?
మహేష్‌తో ఏమీ తీస్తున్నారు నాయనా?
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు, వెంకటేష్‌లతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. మళ్లీ ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో..మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన తొలిచిత్రం నుంచి ముకుంద వరకు శ్రీకాంత్ సినిమాల్లో కథ వుండదు అనే విమర్శను ఎదుర్కొంటున్న  శ్రీకాంత్ బ్రహ్మోత్సవాన్ని కూడా కేవలం కొన్ని సన్నివేశాల బలంతోనే నెట్టుకురావాలనే ప్రయత్నంలో వున్నాడట. ‘ఎక్కడైనా నలుగురు వున్న చోట అందం, ఆనందం వుంటుంది. అలాంటిది అనేక మంది ఒక కుటుంబంలా వుండి, పతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకునేటట్లు వుంటే అదే బ్రహ్మోత్సవం’ అని సినిమా ఓపినింగ్ రోజు పంపిన పత్రికా ప్రకటనలో శ్రీకాంత్ అడ్డాల తెలిపిన ‘బ్రహ్మోతవం' కథ ఇతివృత్తం ఇప్పటికీ మహేష్ అభిమానులకు అర్థం కాక అయోమయంలో వున్నారట. మహేష్ లాంటి స్టార్‌ను పెట్టి మళ్లీ కథ లేకుండానే శ్రీకాంత్ సినిమా తీస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది మహేష్ ఫ్యాన్స్‌కి. ‘శ్రీమంతుడు’తో ఫామ్‌లోకి వచ్చిన తమ అభిమానహీరోకి శ్రీకాంత్ మళ్లీ హిట్ ఇస్తాడా.. లేక సీతమ్మలా మళ్లీ టీవీ సీరియల్‌నే తీస్తున్నాడా..అని ఆందోళన పడుతున్నారు. అంతేకాదు ఇటీవల సినిమా కోసం రియల్‌ఫ్యామిలీస్‌కు ఆహ్వానం అని పంపారు. దీంతో అసలు మహేష్‌తో ఏమీ తీస్తున్నావు శ్రీకాంతా..అంటున్నారు అందరూ.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ