స్టార్ పవర్ ముందు ఎంత గొప్ప సినిమా అయినా బెదిరిపోవాల్సిందే. సత్తాలేని చిత్రం అయినా అమ్ముడుపోయే ఓ బడా ఫేస్ వ్యాల్యూ ఉంటే చాలు; కథ, కథనాలు వగైరాలన్నీ బలాదూర్. నిన్న రిలీజయిన షారుఖ్ ఖాన్ దిల్ వాలే నిజానికి దర్శకుడు రోహిత్ శెట్టి నుండి వచ్చిన అన్ని సినిమాల్లోకెల్లా వీకేస్ట్ అని చెప్పొచ్చు. బట్ షారుఖ్-కాజోల్ జంటను చూసి తరించడం కోసమే అన్నట్లుగా సినీ ప్రేమికులు థియేటర్ల ముందు బారులు తీరారు. మార్నింగ్ షో రిపోర్ట్ నెగెటివ్ అని తెలిసినా ఉధృతి పెరిగిందే తప్ప తగ్గలేదు. దీనికి భిన్నంగా ఉంది బాజీరావు మస్తాని. పూర్తి నిబద్దతతో, సాటిలేని ప్యాషనుతో భన్సాలి తీసిన చరిత్ర మరిచిన ఓ అమోఘమైన ప్రేమ కథకు స్పందన ఇంకొంచెం బాగుండాల్సింది. విపరీతమైన పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో బాజీరావుకు కూడా అడ్వాన్సు బుక్కింగులు ఫుల్ అయ్యాయి. ఇటు స్వదేశంలోను, అటు విదేశాలలోనూ మొదటి ఓటు దిల్ వాలేకు, రెండో ఓటు బాజీరావుకు అన్నట్లుగా ఉన్నాయట బాక్సాఫీస్ ట్రెండ్స్. మరి భన్సాలికి వస్తున్న మౌత్ టాక్ వల్లనయినా షారుఖ్ సినిమాకు కొంతలో కొంత దెబ్బ పడుతుందో లేదో సోమవారం నుండి తెలుస్తుంది...