పూరి జగన్నాథ్ సినిమాలంటే మొదటి రోజు ఎలా ఉన్నా మొదటి వారం ముగిసేలోపు మాత్రం కలెక్షన్స్ ఊపందుకుంటాయి. ఈయన సినిమాలకు ఇది సాధారణంగా జరిగే తంతే. ఫస్ట్ రోజు నుండే డివైడెడ్ రిపోర్ట్స్ రావడం ఈయనకు, ఈయన సినిమాలకు కొత్తేమీ కాదు. అందుకే లోఫర్ నెమ్మదిగానే విడుదలైనా, రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మరింత బలపడే అవకాశం ఉందన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు నిర్మాత కళ్యాణ్, దర్శకుడు పూరీ. మొత్తంగా ఈ చిత్రం ఎంత వరకు వసూల్ చేస్తుందన్న విషయం చెప్పకుండా వరుణ్ తేజ్ నుండి వచ్చిన మొదటి రెండు సినిమాలు అదే ముకుంద, కంచెలను దాటుతుందని చెప్పుకొచ్చారు. ముకుంద కంప్లీట్ డిజాస్టర్, కంచె కూడా క్రిటిక్స్ అండ్ ఒక సెక్షన్ జనాల కోసమే తీసింది కాబట్టి అది ఎంత కలెక్ట్ చేసినా నిర్మాతలు పెట్టిన ఖర్చుకంటే వచ్చింది తక్కువేనన్నది నిజం. లోఫర్ సైతం ఎలాగు చుట్టేసిన సినిమా అని క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది కనక, నిర్మాతలు మరియు బయ్యర్లకు ఎంత వరకు లాభాలొస్తాయి అన్నది అసలు పాయింట్! అసలు ముచ్చట చెప్పకుండా బీటింగ్ రౌండ్ ద బుష్ చేస్తే, బాసూ... అర్థం వేరేలా వస్తుంది మరి!