నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'అల్లుడు శీను'తో పరిచయం చేసి ప్రేక్షకులను ఫర్వాలేదనిపించాడు. కాగా ఆయన ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన 'సుందరపాండ్యన్'కు రీమేక్. వాస్తవానికి రీమేక్ చిత్రాలను తెరకెక్కించడంలో భీమనేని శ్రీనివాసరావు ఆరితేరిన దర్శకుడు. దాంతో తమిళ 'సుందర్‌పాండ్యన్'పై నమ్మకంతో పాటు భీమనేని శ్రీనివాసరావుపై ఉన్న నమ్మకంతో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకొందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి 'స్పీడున్నోడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం విషయంలో అప్‌డేట్స్ లేవు. ఒక టీజర్ కానీ, ట్రయిలర్‌గానీ లేదు. అయినా కూడా ఈ చిత్రం ఇప్పటికే 18కోట్ల బిజినెస్ జరిగిందని, ఇంకా ఓవర్‌సీస్, అదర్ స్టేట్స్, శాటిలైట్ బిజినెస్ కాకముందే కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇంత బిజినెస్ జరిగిందని, దాదాపు రవితేజ లెవల్లో ఈ బిజినెస్ ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఈ సినిమాకు, ఈ హీరోకు అంత సీన్‌లేదని, ఇదంతా బయ్యర్లను ఆకట్టుకోవడానికి, సినిమాకు హైప్ తేవడానికి జరుగుతున్న తంతుగా ట్రేడ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి..!