సంక్రాంతికి ఎలాగైనా 'నాన్నకు ప్రేమతో' సినిమాని విడుదల చేయాలన్నది ఎన్టీఆర్ సంకల్పం. అయితే అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ తండ్రి మరణం ఈ సినిమా విడుదలనుత ప్రభావితం చేసింది. తండ్రి మరణించి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఈ దశలో దేవిశ్రీ రీరికార్డింగ్ ఇవ్వడం అసాధ్యమని సో... 'నాన్నకు ప్రేమతో' విడుదల వాయిదాపడటం ఖాయం అని అంతా అనుకొన్నారు. ఎన్టీఆర్, సుకుమార్‌లు కూడా అదే భావించారు. అయితే దేవిశ్రీప్రసాద్ మాత్రం నావల్ల సినిమా విడుదల ఆగకూడదు. నేను నా వర్క్ కంప్లీట్ చేస్తాను. మీరు కంగారు పడొద్దు.. అని 'నాన్నకు ప్రేమతో' యూనిట్‌కు అభయహస్తం అందించాడు. ఒకట్రెండు రోజుల్లో 'నాన్నకు ప్రేమతో' ఆర్.ఆర్. ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు. సో... ఎన్టీఆర్ బెంగ తీరిపోయినట్టే. సుకుమార్ తనవంతుగా షూటింగ్ పూర్తి చేస్తే చాలు.. మిగిలినదంతా దేవిశ్రీ చూసుకుంటాడు. సో.. గేమ్ ఈజ్ ఆన్. ఈ సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్‌ల పోటీ చూసేయొచ్చనమాట. మొత్తానికి వృత్తిని దైవంగా భావించడం, తన మాట నిలబెట్టుకోవడం, నిబద్దతను చాటుకోవడం అంటే ఇదే అని అందరూ దేవిశ్రీని అభినందిస్తున్నారు.