Advertisementt

పూరీపై మహేష్ బాబు మనసు కరగదా?

Sat 19th Dec 2015 12:42 PM
mahesh babu,puri jagannath,loafer  పూరీపై మహేష్ బాబు మనసు కరగదా?
పూరీపై మహేష్ బాబు మనసు కరగదా?
Advertisement
Ads by CJ

అడపాదడపా జూనియర్ ఎన్టీయార్ లాంటి బడా స్టార్ హీరోలను ఆకర్షించే కథలతో బాక్సాఫీసును సంపన్నం చేసుకునే ప్రయత్నాల్లో పూరీ జగన్నాథ్ కొంత మేరకు విజయం సాధిస్తున్నా మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ 2 లాంటి సినిమా తీయాలన్న ఈయన కోరిక మాత్రం తీరట్లేదు. ఇప్పుడున్న సమయంలో అయితే చిన్నా పెద్దా తేడా లేకుండా నితిన్ హార్ట్ ఎటాక్, చార్మి జ్యోతిలక్ష్మి, వరుణ్ తేజ లోఫర్; ఎవరు దొరికినా టైం వేస్ట్ చేయకుండా సినిమాలు చుట్టేస్తున్న పూరీకి మరి మహేష్ బాబు ఎప్పుడు కరుణిస్తాడో తెలీటం లేదు? పైన పేర్కొన్న మొదటి రెండు చిత్రాలు చూసి చిరంజీవి కూడా హైరానా పడిపోయి రాత్రికి రాత్రి ఆటోజానీని అడ్డంగా ఆపేసాడు. ఇంతటి ఘోరమైన కథా కథనాలతో రోజు రోజుకీ పతనమయిపోతున్న పూరీ స్టాండర్డ్స్ గమనిస్తున్న మహేష్ చచ్చినా అవకాశం కాదు కదా పూరీ కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు అంటున్నారు ఆయన అభిమానులు. దశ తిరిగి పూరీ ఒప్పించినా ప్రిన్స్ ఫ్యాన్స్ గోలగోల చేసైనా ప్రాజెక్టును రద్దు చేయించేలా ఉన్నారు. ఇది తప్పని ప్రూవ్ చేస్తామంటే, ముందు లోఫర్ టిక్కెట్టు కొని అప్పుడు మాట్లాడండి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ