Advertisementt

రామ్ చరణ్ వర్సెస్ వరుణ్ తేజ్!

Fri 18th Dec 2015 08:07 PM
ram charan,varun tej,ram charan vs varun tej,challenge movie,chiranjeevi  రామ్ చరణ్ వర్సెస్ వరుణ్ తేజ్!
రామ్ చరణ్ వర్సెస్ వరుణ్ తేజ్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు, నాగబాబు తనయుడు సుప్రీం హీరో వరుణ్‌తేజ్‌ నుండి ఓ చిత్రంపై మంచి పోటీవాతావరణం నెలకొని ఉంది. మెగాస్టార్‌ కెరీర్‌లో సంచలన విజయం సాధించిన 'ఛాలెంజ్‌' చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి ఈ ఇద్దరు హీరోలు సన్నద్దమవుతున్నారు. తాజాగా విడుదలైన 'లోఫర్‌' చిత్రం రిజల్ట్‌ ఎలా ఉన్నప్పటికీ వరుణ్‌తేజ్‌ నటనకు అన్నిచోట్లా సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మొదటి రెండు చిత్రాలతో 'ఎ' క్లాస్‌ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్‌ తన మూడో చిత్రం 'లోఫర్‌'తో మాస్‌ ఆడియన్స్‌ను కూడా మెప్పించాడు. కొందరు విమర్శకులు ఆయన్ను కాబోయే మెగాస్టార్‌ అని కితాబునిస్తున్నారు. ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే 'బ్రూస్‌లీ' వంటి డిజాస్టర్‌ తర్వాత ఆయన తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌ చేయనున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండగ తర్వాత ప్రారంభం కానుంది. ఈ ఇద్దరు మెగాహీరోలు 'చాలెంజ్‌' సినిమా రీమేక్‌పై మక్కువ చూపిస్తుండటంతో ఇది పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఆ అదృష్టం వీరిద్దరిలో ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ