Advertisementt

శ్రీనువైట్ల మరీ ఇంత చీప్‌ అయ్యాడేంటి?

Fri 18th Dec 2015 07:31 PM
srinu vytla,srinu vytla remuneration,15 lakhs,aagadu,dookudu,bruce lee,ram,rana,c kalyan,suresh babu  శ్రీనువైట్ల మరీ ఇంత చీప్‌ అయ్యాడేంటి?
శ్రీనువైట్ల మరీ ఇంత చీప్‌ అయ్యాడేంటి?
Advertisement
Ads by CJ

'దూకుడు'తో నెంబర్‌వన్‌ డైరెక్టర్ల జాబితాలో చేరి కోట్లలో పారితోషికం తీసుకున్న శ్రీనువైట్లకు ఆ వెంటనే వచ్చిన 'ఆగడు' పెద్ద షాక్‌ ఇచ్చింది. అయినా కూడా ఆయన అదృష్టం కొద్ది రామ్‌చరణ్‌తో 'బ్రూస్‌లీ' అవకాశం వచ్చింది. కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్‌ కావడంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ఏ నిర్మాత, హీరో కూడా సిద్దంగా లేడు. ఈ పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడానికి రామ్‌, రానా వంటి వారు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు. రామ్‌ చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిచనుండగా, రానాతో చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించనున్నాడు. కాగా ఈ రెండు చిత్రాలకు ఆయన కేవలం 15లక్షల పారితోషికానికే పనిచేయనున్నాడని సమాచారం. రెండు మూడు సినిమాల ముందు కోట్లు డిమాండ్‌ చేసిన శ్రీనువైట్ల ఇంత చీప్‌గా చేయడానికి కారణం అందరికీ తెలిసిందే. అయనకు అసలు అవకాశం ఇవ్వడమే కష్టం అనే పరిస్థితుల్లో ఆయనకు ఇంతకావాలి? అని డిమాండ్‌ చేసే సీన్‌ లేదు. ఈ చిత్రాలను వీలైనంత తక్కువ బడ్జెట్‌లో తీసి లాభాలు సంపాదించి పెడితే అప్పుడు మరో సినిమా ఛాన్స్ ఇచ్చి ఆయన కోరుకున్న రెమ్యూనరేషన్‌ ఇస్తానని సి.కళ్యాణ్‌... శ్రీనువైట్లకు హమీ ఇవ్వడం ఒక్కటే ఆయనకు కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ