నిర్మాతగా పడుతూ లేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు AM రత్నం. వరసగా తలా అజిత్ గారితో తమిళంలో సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆర్థికంగా స్థిరపడుతున్న సమయంలో మరోసారి కొడుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ తెలుగు, తమిళ సినిమాను ఈ రోజు లాంచ్ చేసారు. దీని పేరే ఆక్సిజన్. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ సైంటిఫిక్ చిత్రం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇంతకు మునుపు రత్నం గారు కేవలం కొడుకు రవికృష్ణ, జ్యోతికృష్ణల వల్లే రోడ్డు మీద పడ్డారన్న అపవాదు కాలీవుడ్ అంతటా ఉండనే ఉంది. మెల్లిమెల్లిగా రత్నంగారు గాడిలో పడుతున్న తరుణంలో కొడుకుకి దర్శకత్వం అప్పజెప్పడం జనాలు సాహసమే అంటున్నారు. జగపతి బాబు, రాశి ఖన్నాలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఆక్సిజన్ వల్ల రత్నంగారు మళ్ళీ ముక్కులోకి ఆక్సిజన్ ట్యూబు పెట్టుకునే అవస్థకు చేరుకుంటారా లేక గోపీచంద్ సప్లయ్ చేసే ఆక్సిజన్ వల్ల రత్నం గారబ్బాయికి కూడా కొత్తగా ప్రాణవాయువు దొరుకుతుందా?