మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే దారిలో పయనిస్తూ ఉండటం విశేషం. 'బ్రూస్‌లీ' డిజాస్టర్ తర్వాత రామ్‌చరణ్ తమిళంలో సూపర్‌హిట్ అయిన 'తని ఒరువన్' రీమేక్‌కు ఓటేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి రామ్‌చరణ్ ఆదేశంతో దర్శకుడు సురేందర్‌రెడ్డి కుస్తీ పడుతున్నాడు. ఇక తాజాగా ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సైతం తన 150వ చిత్రానికి తమిళ 'కత్తి' రీమేక్‌నే నమ్ముకున్నాడు. ఈ చిత్రంలో భారీ మార్పులు చేయడానికి డైరెక్టర్ వినాయక్‌తో పాటు పరుచూరి బ్రదర్స్ కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు హీరోయిన్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు. అంతేగాక ఈ తండ్రికొడుకులు ఇద్దరూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లనే చేయనుండటం మరో విశేషం. మరి వీరి ప్రయత్నాలు ఎలాంటి కొలిక్కి వస్తాయి? వీటికి పనిచేసే టెక్నీషియన్స్, నటీనటులు, మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఎవరు? వంటి విషయాలన్ని మరో వారం పదిరోజుల్లో ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.