Advertisementt

ఎన్టీఆర్‌ వచ్చే ఛాన్సేలేదు...!

Thu 17th Dec 2015 08:24 PM
jr ntr,sankranthi,dictator,balakrishna,devisri prasad,nannaku prematho,nannaku prematho movie,sankranthi race,sathya murthy  ఎన్టీఆర్‌ వచ్చే ఛాన్సేలేదు...!
ఎన్టీఆర్‌ వచ్చే ఛాన్సేలేదు...!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్‌ ఇంకా 20శాతం మిగిలే ఉంది. మరో రెండు పాటలను కూడా చిత్రీకరించాల్సివుంది. ఇక ఈ చిత్రానికి రీరికార్డింగ్‌తో పాటు పలు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. ఇంతలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి స్వర్గస్తులైనారు. ఈ దు:ఖంలో శోకసంద్రంలో ఉన్నాడు దేవిశ్రీప్రసాద్‌. దీంతో ఆయన్ను మానసికంగా బాగా కోలుకునే వరకు ఇబ్బంది పెట్టకూడదని సుకుమార్‌, ఎన్టీఆర్‌లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఆడియోను ఈనెల 23న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ వేడుక వాయిదా పడింది. దీంతో బాలకృష్ణ 'డిక్టేటర్‌'కు పోటీగా ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో ' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎన్టీఆర్‌ కిందటి చిత్రం 'టెంపర్‌' కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్‌ సోదరుడు జానకీరాం మృతితో ఎన్టీఆర్‌ షాక్‌కు గురికావడం... కొన్ని రోజులు షూటింగ్‌కు రాకపోవడంతో ఆ సినిమా వాయిదా పడి ఫిబ్రవరిలో విడుదలైంది. ఇప్పుడు అదే పరిస్థితిలో 'నాన్నకు ప్రేమతో' కూడా ఉండటం విధి విచిత్రం...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ