పాతా సామాన్లు కొంటాం అన్న వంశీ గారి ఫన్నీ మ్యానరిజంలాగే ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన పాత హీరోయిన్లకు కొత్త గిరాకీ మొదలవుతోంది. పెళ్ళయి పిల్లలను కన్నాక కూడా ఈ ఆంటీలకి సెకండ్ ఇన్నింగ్స్ స్వాగతం పలుకుతోంది. కొందరు దర్శకులయితే ఈ కోటాలోని ఆంటీలు ఎక్కడెక్కడ దొరుకుతారా అని జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు. నదియా, మీనా, రమ్య కృష్ణ, సిమ్రాన్ లాంటి వాళ్ళందరూ ఈ క్యాటగరీ కిందే వస్తారు. ఇక అసలు విషయానికి వస్తే మణిరత్నం రోజా సినిమా చూసిన వాళ్ళందరికీ హీరోయిన్ మధుబాల గుర్తుండే ఉంటుంది. అటు తరువాత అంత గొప్ప సినిమాలు చేయకపోయినా అడపాదడపా తెలుగులోనో, తమిళంలోనో ఈవిడ కనిపిస్తూనే ఉంది. ఎంత చేసినా మధుబాలాకి రెండో ఇన్నింగ్స్ పెద్దగా బ్రేక్ అయితే దొరకలేదు. అంతకుముందు ఆ తరువాత అనే సుమంత్ అశ్విన్ సినిమాలో మంచి క్యారెక్టర్ పడినా పెద్దగా లాభపడింది ఏమీ లేదు. మరి ఎక్కడి నుండి పడిందో గానీ దర్శకుడు సుకుమార్ కన్ను ఇప్పుడామెను నాన్నకు ప్రేమతో చిత్రంలో కీలక పాత్రను ఇచ్చి గౌరవించినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీయార్ సినిమాలో అనగానే హిట్టు పడితే బ్రేక్ రావడం ఈజీ అవుతుంది. కాబట్టి విషయాన్ని ఇన్ని రోజులు దాచి ఉంచి మంచి పనే చేసాడు సుక్కు. మధుబాల కూడా మనసు పెట్టి ఈ పాత్ర చేసిందని తెలుస్తోంది.