హీరో రాజశేఖర్ తన కెరీర్ ప్రారంభంలో కొన్ని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ ఆయన హీరోగా మాత్రమే ఈతరం ప్రేక్షకులకు తెలుసు. ఆయన్ను మనం వెండితెరపై అతి త్వరలో విలన్‌గా చూడబోతున్నాం. తన సొంత కూతురు హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. రాజశేఖర్ కూతురు శివాని 'వందకు వంద' మూవీతో హీరోయిన్‌గా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నాడు. ఈమధ్య రాజశేఖర్‌కు హీరోగా అసలు కలిసి రావడం లేదు. దీంతో ఆయన్ను కొందరు స్టార్‌డైరెక్టర్లు, నిర్మాతలు తమ సినిమాల్లో విలన్ పాత్రలు చేయమని అడిగినా ఆయన ఒప్పుకోలేదు. ఇన్నాళ్ల్లు విలన్ పాత్రలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపని రాజశేఖర్.. కూతురు సినిమా కోసం విలన్‌గా మారుతున్నాడు. రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్న సినిమా కావడం వల్ల పబ్లిసిటీపరంగా కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ ఇతర సినిమాల్లోనూ విలన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం.