'అంతకు ముందు.. ఆ తరువాత' సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది వెటరన్ హీరోయిన్ మధుబాల. ఈ సినిమా తర్వాత 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంలో నిఖిల్‌కు తల్లిపాత్రలో అలరించింది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఆమె ఖాతాలో చేరింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె కనిపించనుంది. ఎన్టీఆర్-సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం మధుబాలను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు సుక్కు ఈ విషయాన్నిసీక్రెట్ గా ఉంచాడు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. 'నాన్నకు ప్రేమతో' సినిమా చేయడం మరిచిపోలేని అనుభవం. ఎన్టీఆర్, జగపతిబాబు, సుకుమార్‌లతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మా కాంబినేషన్‌లో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి... అంటూ ఆమె ట్వీట్ చేసింది. మొత్తానికి ఈ చిత్రంతో మధుబాల బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారుతానని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది.