Advertisementt

పూరీ...టైం చూసి పేల్చాడు..!

Thu 17th Dec 2015 03:37 PM
loafer,puri jagannadh,pawan fans,devudu,loafer audio launch  పూరీ...టైం చూసి పేల్చాడు..!
పూరీ...టైం చూసి పేల్చాడు..!
Advertisement
Ads by CJ

ఇటీవల జరిగిన 'లోఫర్‌' ఆడియో ఫంక్షన్‌ తర్వాత పవన్‌కళ్యాణ్‌ అభిమానులపై కామెంట్స్‌ చేసి వారి ఆగ్రహానికి గురయ్యాడు దర్శకుడు పూరీజగన్నాథ్‌. పూరీ 'లోఫర్‌' ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ అభిమానుల హంగామాను ఉద్దేశించి మాట్లాడుతూ... పవన్‌ ఫ్యాన్స్‌ తీరు ఇరిటేటింగ్‌గా ఉంది. ఈ విషయంలో పవన్‌ స్వయంగా స్పందించాలి. భవిష్యత్తులోను ఇలాంటి సంఘటన జరిగితే పవన్‌ ఫ్యాన్స్‌కి కామన్‌సెన్స్‌ లేదనుకొంటారు.. అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మాటలు అభిమానులను హర్ట్‌ చేశాయి. దీని ఎఫెక్ట్‌ పూరీజగన్నాధ్‌ తాజా చిత్రం 'లోఫర్‌' పై పడనుందని కూడా కథనాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు అభిమానులను కూల్‌ చేసే పనిలో పడ్డాడు పూరీ. 'పవన్‌ మీకు స్టారేమో? కానీ నాకు పవన్‌ దేవుడు' టైం చూసి ఓ మాట పేల్చాడు. మరి, పూరీ చేసిన పవన్‌ 'దేవుడు' కామెంట్‌ అభిమానులను ఏమేరకు శాంతింపజేస్తుందో చూడాలి...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ