మాస్‌మహారాజా రవితేజ హీరోగా తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కిన 'బెంగాల్‌టైగర్' సినిమా గత గురువారం విడుదలై విజయపథంలో దూసుకుపోతోంది. ఈచిత్రం అన్ని చోట్లా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇందులో రవితేజ మార్క్ కామెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. సోమవారం కూడా పెద్దగా ప్రేక్షకులు తగ్గినట్లుగా, డ్రాప్ కనపడలేదు. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం సుమారు 10కోట్ల షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌కు 7కోట్లు సంపాదించిపెట్టింది. ఈ సినిమా మాస్‌ను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఎప్పటికి బి, సి సెంటర్స్ లో ఈ మూవీ ఫుల్ కలెక్షన్ రాబడుతోంది.