తెలుగు పాప్ ఆల్బమ్ ‘సెల్ఫీ క్వీన్’ రిలీజ్
విజయమూర్తి రూపొందించిన తెలుగు పాప్ ఆల్బమ్ ‘సెల్ఫీ క్వీన్’. ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ఫీల ట్రెండ్ పై సాగే ఈ ఆల్బమ్ రాజేంద్ర పుట్ట దర్శకత్వంలో గంటా హరి నిర్మించారు. మంత్ర ఆనంద్ సంగీతం అందించారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. బిగ్ సీడీని కృష్ణుడు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేంద్ర పుట్ట, నిర్మాత గంటా హరి, మంత్ర ఆనంద్, సాయివెంకట్, కాసర్ల శ్యామ్, సిద్ధాంశ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణుడు మాట్లాడుతూ...'ఇప్పుడు ఉన్న ట్రెండ్ సెల్ఫీలే. దీనిపై పాప్ ఆల్బమ్ చేయాలనే ఆలోచన బావుంది. ఆల్బమ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నాను'.. అన్నారు.
సాయివెంకట్ మాట్లాడుతూ…'సాంగ్ మ్యూజిక్, పిక్చరైజేషన్ బావుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్..' అన్నారు.
నిర్మాత గంటా హరి మాట్లాడుతూ…'సినిమా చేయాలనే ఆలోచన ఉన్న నాకు రాజేంద్ర పుట్ట, విజయమూర్తిగారు కలిసి ఈ ఆల్బమ్ చేద్దామని అన్నారు. నేను కూడా సరేనన్నాను. దాంతో ఈ ఆల్బమ్ రూపొందింది. బాగా నచ్చింది' అన్నారు.
దర్శకుడు రాజేంద్ర పుట్ట మాట్లాడుతూ …'యూనిట్ అంతా కలిసి చేసిన ప్రయత్నం. తెలుగులో పాప్ ఆల్బమ్స్ వచ్చి చాలా రోజులైంది. మళ్ళీ ట్రెండ్ మొదలవుతుందని భావిస్తున్నాం'.. అన్నారు.
మంత్ర ఆనంద్ మాట్లాడుతూ.. 'పాప్ ఆల్బమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలని చేసిన ప్రయత్నానికి మంచి పేరు వచ్చింది. బాబా సెహగల్ గారు ఈ పాట పాడటంతో ఆల్బమ్ రేంజ్ పెరిగింది' అన్నారు.
విజయమూర్తి మాట్లాడుతూ ..'నేను ఈ ఆల్బమ్ చేయక ముందు షార్ట్ ఫిలింస్ చేశాను. రెండు సినిమాల్లో కూడా నటించబోతున్నాను. అందులో ఒకటి డిసెంబర్ , రెండోది జనవరిలో రిలీజ్ కానుంది' అన్నారు.