బాలకృష్ణ డిక్టేటర్ రిలీజుని చూసి జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన భయపడతారేమో గానీ నాకేం భయం లేదనే రేంజులో సంక్రాంతి పోరులో దిగబోతున్నాడు తమిళ హీరో విశాల్. విశాల్ హీరోగా, పాండ్య రాజ్ దర్శకుడిగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మీద రానున్న కొత్త సినిమా కథకళి గురించే ఈ ప్రస్తావన అంతా. క్యాథరీన్ తెరీసా, రెజినా కసండ్రా హీరోయిన్లుగా నటించిన ఈ పూర్తి యాక్షన్ సినిమాని ఎలాగైనా తమిళం, తెలుగులో ఒకేసారి సంక్రాంతికి విడుదల చేయాలన్నది విశాల్ ప్లాన్. 14 జనవరి రిలీజు తారీఖును తమిళంలో అనౌన్స్ చేసారు కాబట్టి తెలుగులో కూడా అదే రోజు వచ్చే సూచనలు ఉన్నాయి. కథకళి టైటిల్ ఆకర్షణీయంగా ఉంది, విశాల్ కోసం కూడా సినిమాకు వచ్చే జనాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండనే అన్నారు కాబట్టి సరైన సంఖలో మంచి సినిమా హాల్స్ దొరికితే డిక్టేటర్ ముందు కథకళి ఆడేందుకు విశాల్ సిద్ధం. మొన్నే నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్ తనకున్న పవర్ గనక ఉపయోగించుకుంటే ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజు కూడా అనుకున్న డేటుకి సాధ్యమే.