ప్రస్తుతానికి అయితే బ్రహ్మానందం కామెడీ అంటేనే జనానికి విరక్తి పుట్టుకొచ్చే స్థాయికి మనాడిని వాడుకున్నారు దర్శక నిర్మాతలు. పైగా పృథ్వి, జబర్దస్త్ బ్యాచి చేస్తున్న హడావిడి ముందట బ్రహ్మీ పేరు కూడా పెద్దగా వినబడడం కూడా లేదు. మరి ఇటువంటి భయానక సమయంలో ఆటాడుకుందాం రా అంటూ సుశాంత్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కేవలం కామెడీ కోసం, అదీ బ్రహ్మానందం మీద కామెడీ కోసం టైం మెషిన్ పేరిట అరవై లక్షల సెట్ వేయించారట దర్శకుడు నాగేశ్వర రెడ్డి. నిర్మాతలు చింతలపూడి శ్రీనివాస్ రావు, నాగ సుశీలల ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా సుశాంత్ సినిమా బడ్జెట్ పరిమితుల్లో అరవై లక్షలు కేవలం ఓ కామెడీ ఎపిసోడ్ కోసం అంటే అది సాహసమైన మూర్ఖత్వమే అవుతుంది అన్నది కొందరి వాదన. ఇద్దరు స్నేహితులు విడిపోవడం అనే ఓ ఎమోషనల్ స్టోరీ పాయింట్ మీద నడిచే ఈ సినిమాలో సుశాంత్, బ్రహ్మీ మధ్య వచ్చే టైం మెషిన్ హాస్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని తాము పెట్టిన అరవై లక్షలకు జస్టిఫికేషన్ ఇచ్చుకునెందుకు నిర్మాతలు కష్టపడుతున్నారు.