కేవలం హీరో క్యారేకర్ మీద ఓ సినిమా మొత్తాన్ని నడిపించే కథని, కథనాన్ని మన యావత్ భారత దేశంలో గానీ గ్లోబ్ మొత్తం మీద గానీ తయారు చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పూరి జగన్నాథ్ ఒక్కరే. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకున్నదే అయినా, మరి ఎందుకు పూరీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ముప్పై నలభై కోట్లలోపే బిజినెస్ క్లోజ్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీయార్ టెంపర్ చిత్రం క్రిటిక్స్ నుండి కూడా సూపరుగా మార్కులు వేయించుకుని, రెండో వారం తిరక్కుండానే కూలబడిపోయింది. ఇక జ్యోతిలక్ష్మి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందరు ఎన్ని చెప్పినా పూరీ సినిమా అంటే కొంత మందికి ఆ కిక్కే వేరప్ప అన్న స్టైల్లో ఉంటుంది. అందుకే రేపు రానున్న లోఫర్ కోసం వేచి చూస్తున్నారు. నాకు ఇవ్వాల్సిన పది కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేస్తే సినిమాను ఇంతలో కంప్లీట్ చేసి మీ చేతిలో పెట్టేస్తా అని మొహం మీద మొహమాటం లేకుండా చెప్పే పూరీకి లోఫర్ కూడా అటువంటి కమిట్మెంటే అని మళ్ళీ విప్పి చెప్పాల్సిన పని లేదు. పాపం వరుణ్ తేజ్ దీనికన్నా ఎక్కువ ఊహించుకున్నా, మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఆశపడ్డా... రేపు భంగపడక తప్పదు.