Advertisementt

ఇంక దేనికి మెగా స్టార్ ఆలస్యం?

Wed 16th Dec 2015 01:42 PM
chiranjeevi,150th film,vinayak  ఇంక దేనికి మెగా స్టార్ ఆలస్యం?
ఇంక దేనికి మెగా స్టార్ ఆలస్యం?
Advertisement
Ads by CJ

తమిళం సినిమా కత్తి కథ తప్ప తమకు దొరికిన మిగితా కథలన్నీ తుప్పు పట్టినవేనని మెగా క్యాంపు ఒప్పేసుకుంది. కాబట్టి చిరంజీవి నూట యాభయ్యో సినిమాకు కత్తినే మరింత పదును పెట్టడానికి వినాయక్ చేతిలో కూడా పెట్టేసారు. అయినా ఇలా మెగా మైల్ స్టోన్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి విషయము అనఫీశియలుగానే బయటకు పొక్కుతోంది తప్ప చిరంజీవి గానీ రామ్ చరణ్ గానీ మీడియా వారికి ఏ ఒక్క అప్ డేట్ కూడా పాస్ చేయడం లేదు. చిరంజీవికున్న స్టార్ చరిష్మాను ప్రశ్నించేలా వచ్చిన బ్రూస్ లీ కలెక్షన్స్ చూసిన తరువాత మెగా ఫ్యామిలీకి సరైన షాక్ తగిలే ఉంటుంది. అందుకే ఆచితూచి అడుగేస్తూ ప్రెస్ వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అన్నీ కుదిరాక ఒకేసారి ప్రెస్ నోట్ విడుదల చేద్దామని అనుకోవచ్చు. ఓ పక్క వినాయక్ అందుకున్న అఖిల్ చివాట్లు, మరో పక్క బ్రూస్ లీతో రామ్ చరణ్, చిరంజీవి తెచ్చుకున్న పాట్లు, ఇవన్నీ జనాలు ఇప్పట్లో మరిచిపోయేవి కావు. పాత గాయాలు మానేవరకు కొత్త సినిమా సంగతులు మేము చెప్పలేము అనుకుంటే కత్తి ఫైనల్ న్యూస్ రావడానికి కనీసం ఇంకో ఏడాదైనా పట్టొచ్చు. అప్పట్లోపు ప్రజలు కూడా చిరంజీవిని మరిచిపోరా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ