Advertisementt

‘డిక్టేటర్’ను కూడా భయపెడుతున్నాడు!

Wed 16th Dec 2015 11:35 AM
balakrishna,dictator,sriwaas,kona venkat,kona venkat problem to dictator business  ‘డిక్టేటర్’ను కూడా భయపెడుతున్నాడు!
‘డిక్టేటర్’ను కూడా భయపెడుతున్నాడు!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డిక్టేటర్’. ఈ సంక్రాంతికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం ఈ చిత్ర బిజినెస్ విషయంలో మైనస్‌గా మారింది. ఈ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు కోనవెంకట్ భయం పట్టుకుంది. మొదట్లో ఈ చిత్ర పంపిణీ హక్కులను ఫ్యాన్సీ రేట్లకు ఆఫర్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఇటీవల కోన పనిచేసిన బ్రూస్‌లీ, అఖిల్, త్రిపుర, శంకరాభరణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలుగా నిలవడంతో ‘డిక్టేటర్’ బిజినెస్ విషయంలో మళ్ళీ బేరాలు మొదలుపెట్టారని తెలిసింది. అంతేకాకుండా బాలకృష్ణ ముందు చిత్రం ‘లయన్’ కూడా ఫెయిల్యూర్‌గా నిలవడంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందు ఒప్పందం చేసుకున్న రేట్ల ప్రకారం కూడా తగ్గించమని అడుగుతున్నారట. అయితే నిర్మాత, దర్శకుడు శ్రీవాస్ మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదని సమాచారమ్. ఇష్టం వుంటే ముందు అనుకున్న ప్రకారం అమౌంట్ చెల్లించి తీసుకోమని లేదంటే.. వేరే పంపిణీదారులకు హక్కులు ఇచ్చేస్తానని ఖరాఖండిగా చెబుతున్నాడట..! అయితే  కోనవెంకట్ కథలో చిన్న చిన్న మైనస్‌లు వున్నా.. బాలకృష్ణ తన నటనాపటిమతో ఆ తప్పులను కనిపించకుండా చేస్తాడని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు.. ఇప్పుడు బాలయ్య మీద వున్న నమ్మకమే డిస్ట్రిబ్యూటర్లను ముందుకు నడిపిస్తుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ