Advertisementt

నందమూరి అభిమానుల ఆశ నెరవేరుతుందా?

Wed 16th Dec 2015 11:11 AM
jr ntr,balakrishna,dictator audio launch,nannaku prematho,balakrishna with jr ntr,young tiger,amaravati  నందమూరి అభిమానుల ఆశ నెరవేరుతుందా?
నందమూరి అభిమానుల ఆశ నెరవేరుతుందా?
Advertisement
Ads by CJ

నందమూరి హీరోలందరూ మరీ ముఖ్యంగా బాబాయ్‌ బాలకృష్ణ, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లు కలిసి మెలిసి ఒకటైతే చూడాలని నందమూరి అభిమానుల ఆశ. కాగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డిక్టేటర్‌' ఆడియో వేడుక ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో ఈ నెల 20న గ్రాండ్‌గా జరుగనుంది. ఈ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా హాజరవుతాడని నందమూరి ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈసారి బాలయ్య అండ్‌ టీమ్‌ ఎన్టీఆర్‌ను తప్పక ఆహ్వానిస్తారని వారు భావిస్తున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరుగనుంది. అయితే బాలయ్యతో పాటు ఎన్టీఆర్‌ సినిమా కూడా సంక్రాంతికే విడుదలకు సిద్దం అవుతుండటంతో బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా ఎన్టీఆర్‌ రాకపోవచ్చని కొందరు భావిస్తుండగా, ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ముఖ్యులు హాజరవుతున్నందున ఎన్టీఆర్‌ను పిలవకపోవచ్చని, ఇప్పటికీ అబ్బాయ్‌ ఎన్టీఆర్‌, బాబాయ్‌ బాలకృష్ణల మధ్య ఇంకా కోల్డ్‌వార్‌ నడుస్తోందని, ఈ విషయం వీరి సినిమాల తేదీలలోనే తెలుస్తోందని మరికొందరు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ