Advertisementt

ఐషాశర్మను పూరీ కొంచెం వాడి వదిలేశాడు!

Wed 16th Dec 2015 10:45 AM
aisha sharma,rogue movie,puri jagannadh,puri rejected aisha sharma,rogue movie  ఐషాశర్మను పూరీ కొంచెం వాడి వదిలేశాడు!
ఐషాశర్మను పూరీ కొంచెం వాడి వదిలేశాడు!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ ప్రస్తుతం 'లోఫర్‌' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈచిత్రం ఈనెల 17న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఆయన నిర్మాత మనోహర్‌ (మహాత్మ) అన్నకొడుకు ఇషాంత్‌ ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో 'రోగ్‌' చిత్రాన్ని ఎప్పుడో మొదలుపెట్టేశాడు. కాగా ఈచిత్రంలో ఆయన ఐషాశర్మను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఆమెపై ఆమధ్య బ్యాంకాక్‌లో కొన్ని సీన్స్‌ను కూడా చిత్రీకరించాడు. వాస్తవానికి టాలీవుడ్‌లో పూరీ హీరోయిన్లకు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఎందరో ఆయన డైరెక్షన్‌ వహించే చిత్రంలో నటించాలని ఆశపడుతుంటారు. కానీ ఏవో సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుండి ఐషాశర్మను పూరీ తప్పించాడట. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా అమైరా దస్తూర్‌ ఎప్పుడో ఫిక్స్‌ అయింది. మరి మరో హీరోయిన్‌గా ఎవరిని పూరీ ఎంపిక చేస్తాడో చూడాలి..! ఇక ఐషాశర్మ విషయానికి వస్తే ఆమెను ఆమధ్య విడుదలైన రామ్‌ 'శివమ్‌'లో హీరోయిన్‌గా తీసుకొని ఆ తర్వాత తప్పించారు. ఇది తెలిసిన వారు అయ్యో...పాపం ఐషా... అంటున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ